సీఎం గడ్డపై కదం తొక్కిన మల్లన్న కొడంగల్‌లో హోరెత్తిన బీసీ రాజ్యాధికార పాదయాత్ర

0
1

సీఎం గడ్డపై కదం తొక్కిన మల్లన్న కొడంగల్‌లో హోరెత్తిన బీసీ రాజ్యాధికార పాదయాత్ర భారత్ అవాజ్ కొడంగల్ సెప్టెంబర్ 26:- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ఇలాఖా కొడంగల్ గడ్డపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) వ్యవస్థాపకుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేపట్టిన బీసీ రాజ్యాధికార యాత్ర పాదయాత్ర రూపంలో కొడంగల్ నియోజకవర్గానికి చేరుకోవడంతో స్థానిక రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది.అడుగడుగునా ప్రజలు యువత బీసీ సంఘాల శ్రేణులు పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలకగా యాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన కాంగ్రెస్ సర్కార్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా తీరుపై మునుపెన్నడూ లేని రీతిలో విరుచుకుపడ్డారు.తెలంగాణ గడ్డపై 80 ఏళ్లుగా అధికారం కేవలం రెండు సామాజిక వర్గాల చేతుల్లోనే బందీ అయింది.56 శాతానికి పైగా ఉన్న బహుజనులు ఇంకా ఓటర్లుగానే మిగిలిపోవాలా? పాలకులయ్యే అర్హత మాకు లేదా?” అంటూ మల్లన్న వేసిన ప్రశ్నలు సభా ప్రాంగణాన్ని ఆలోచింపజేశాయి.2028లో బీసీ బిడ్డను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడమే ధ్యేయంగా ఈ పాదయాత్ర మొదలైందని ఆ లక్ష్యం నెరవేరే వరకు విశ్రమించేది లేదని ఆయన తేల్చిచెప్పారు.ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే మౌలిక వసతులు లేక పాఠశాలల దుస్థితి నిరుద్యోగంతో యువత అల్లాడుతున్న వైనాన్ని పాదయాత్రలో ప్రజలు తన దృష్టికి తెచ్చారని ఆయన ఎండగట్టారు.ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి బహుజనుల హక్కులను కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు.స్థానిక ప్రజలు యువత పెద్ద ఎత్తున తరలివచ్చి మల్లన్న ప్రసంగానికి హర్షధ్వానాలతో మద్దతు పలికారు.మొత్తానికి సీఎం సొంత నియోజకవర్గంలో మల్లన్న చేపట్టిన ఈ పాదయాత్ర చేసిన ఘాటు వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.