రామనగర్‌లో పర్యటించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.. సమస్యలపై ఆరా.,|

0
15

● మురుగునీటి కాలువల సమస్యకు పరిష్కారం చూపాలని సూచన

● దెబ్బతిన్న విద్యుత్ స్తంభం స్థానంలో కొత్తది ఏర్పాటు చేయాలని ఆదేశం

● పార్కు సుందరీకరణ పనులు పూర్తి చేయిస్తామని హామీ

మేడ్చల్-మల్కాజిగిరి, ఆగస్టు 12: ఆల్వాల్, రామ్ నగర్‌లోని పలు సమస్యలను మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.

అరుణ్, సాజిద్, లింగారెడ్డి, రాహుల్, ప్రశాంత్‌లతో కలిసి కాలనీలో పర్యటించి స్థానికులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా మురుగునీటి కాలువలలో ఏర్పడిన అడ్డంకులు, దెబ్బతిన్న విద్యుత్ స్తంభం, పార్కు సుందరీకరణ పనులు ఇంకా పూర్తికాకపోవడం వంటి సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు.

స్థానికుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్న శాంతి శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

#sidhumaroju

Alwal