ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు|

0
1

కోసిగి మండల కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సీపీఐ కార్యాలయం నుంచి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ వరకు ర్యాలీ నిర్వహించి, మాజీ జిల్లా కోశాధికారి నరసింహులు చేతుల మీదుగా జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న ఏకైక సంఘం ఏఐఎస్ఎఫ్ అని కొనియాడారు. అనంతరం జిల్లా ఉపాధ్యక్షుడు ఈరేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని విమర్శించారు. నిరుద్యోగులకు 3 వేల భృతి, ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయకపోగా, పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో 77ను రద్దు చేయకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇచ్చిన హామీలతో పాటు విద్యారంగ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్, సీపీఐ నాయకులు సుదర్శన్, తాయన్న, రాజు, విద్యార్థులు పాల్గొన్నారు.