రేవంత్ సోదరుడి కంపెనీకి భూ కేటాయింపుల్లో భారీ కుంభకోణం|

0
1

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయన సోదరుడు అనుముల కొండల్ రెడ్డి చైర్మన్‌గా ఉన్న ‘టెసరాక్ట్’ అనే షెల్ కంపెనీకి రూ. 200 కోట్ల విలువైన 5 ఎకరాల భూమిని కేవలం రూ. 7 కోట్లకే కట్టబెట్టిందని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ కంపెనీలో ఒక్క ఉద్యోగి కూడా లేకపోవడం గమనార్హం. కర్ణాటకలో సిద్ధరామయ్య భూకేటాయింపుల తరహాలోనే ఇదొక పెద్ద కుంభకోణమని విమర్శకులు మండిపడుతున్నారు. అలాగే సీఎం మరో సోదరుడు జగదీష్ రెడ్డికి సంబంధించిన ‘స్వచ్ఛ్ బయో’ ఒప్పందం, బావమరిది సృజన్ రెడ్డికి దక్కిన రూ. 1,137 కోట్ల అమృత్ కాంట్రాక్టులపైనా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కుంభకోణాలను మంత్రి శ్రీధర్ బాబు వెనకేసుకొస్తున్నారని, సీఎం అన్న తిరుపతి రెడ్డి అధికారుల చేత దండాలు పెట్టించుకుంటూ రాజ్యాంగేతర శక్తిగా చెలామణి అవుతున్నారని విమర్శించారు.