భారత్ ఆవాజ్, కొమురం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి జగదీష్:కొమురం భీం ఆసిఫాబాద్ నూతన వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా (DMHO) బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ నాగేంద్రను బిజెపి నాయకులు ఘనంగా సన్మానించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మొదటిసారిగా అరిగెల నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సీనియర్ నాయకులు అరిగెల నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ మరియు బిజెపి ప్రధాన కార్యదర్శి అరిగెల మల్లికార్జున్ ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఒక మారుమూల ప్రాంతంలో జన్మించి, ఇక్కడి వైద్య సవాళ్లను స్వీకరించి, ప్రజలకే వైద్యాధికారిగా సేవ చేసే అవకాశం రావడం చాలా అభినందనీయమని కొనియాడారు. అనంతరం వైద్యాధికారి మాట్లాడుతూ.. ఆదివాసి గ్రామాలలో వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించి మంచి గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కుందరపు బాలకృష్ణ, నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.










