కూకట్‌పల్లిలో ఇందిరమ్మ టవర్ల శంకుస్థాపనకు ఏర్పాట్లు|

0
2

కూకట్‌పల్లి 9వ ఫేజ్ గోకుల్ ప్లాట్స్ వద్ద నిర్మించనున్న ఇందిరమ్మ టవర్ల శంకుస్థాపనకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, టీపీసీసీ ఉపాధ్యక్షులు బండి రమేష్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ.. నామమాత్రపు ధరకే పేదలకు ఇళ్లు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. హైదరాబాద్ పరిధిలో 16 నియోజకవర్గాల్లో రూ.807 కోట్లతో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఒక్కో ప్లాటుకు ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ ఇస్తుండగా, లబ్ధిదారుడు రూ.6 లక్షలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. వార్షిక ఆదాయం రూ.6 లక్షల లోపు ఉన్న అర్హులు ఆగస్టు 15వ తేదీలోపు మీ-సేవా లేదా 8096958096 వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కూకట్‌పల్లి నుంచే ఈ పథకం ప్రారంభించడంపై సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.