భారత్ ఆవాజ్ న్యూస్ :కదిరి ప్రజా సమస్యలపై పోరాటాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా కడపలో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు కదిరి డివిజన్ నుంచి సీపీఐ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సభలో విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతులు, కార్మికుల సమస్యలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, ప్రజా సంక్షేమం, ప్రజాస్వామ్య హక్కులు తదితర అంశాలపై సభలో చర్చ జరుగుతుందని పేర్కొన్నారు.ప్రజా సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో చేపట్టాల్సిన ఉద్యమాలకు సభ ద్వారా దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిపారు. రైతులు, కార్మికులు, విద్యార్థులు, యువత హక్కుల పరిరక్షణతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన పోరాటాలపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ కదిరి నియోజకవర్గ కార్యదర్శి పవన్, జిల్లా కార్యవర్గ సభ్యులు మధు నాయక్, చలపతి నాయుడు, డివిజన్ సహాయ కార్యదర్శి హాసన్, బీకేఎంయూ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి రమణ, మండల కార్యదర్శులు జిగిలి ఈశ్వరయ్య, రెడ్డప్ప, శ్రీరాములు నాయుడు, వెంకటరమణ, రామాంజినేయులు, నాయకులు సిద్ధయ్య, కొండయ్య, రామచంద్ర, అనిల్ తదితరులు పాల్గొన్నారు.










