● 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సందడి
● పలు ప్రాంతాల్లో జాతీయ పతాకావిష్కరణ.. అభివృద్ధి పనులకు శ్రీకారం
● దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పిలుపు
మల్కాజ్గిరి, ఆగస్టు 15: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజ్గిరి నియోజకవర్గంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు, కాలనీలు, ప్రధాన కూడళ్లలో జరిగిన వేడుకలకు హాజరై జాతీయ పతాకానికి గౌరవం సమర్పించారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, మహిళలు, యువత, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అల్వాల్ మున్సిపల్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం అల్వాల్ మీ సేవా సెంటర్ సమీపంలోని తెలంగాణ తల్లి విగ్రహం, నేరేడ్మెట్ చౌరస్తా, మల్కాజ్గిరి చౌరస్తా వద్ద జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. విమలాదేవి నగర్‌లోని వందేమాతరం లైబ్రరీ సీనియర్ సిటిజన్స్ డే కేర్ సెంటర్లో పతాకావిష్కరణ చేసి, అక్కడ నిర్వహించిన క్యారం పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈస్ట్ ఆనంద్‌బాగ్ డివిజన్లోని న్యూ శ్రీనగర్ కాలనీలో రూ.11 లక్షల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ అదనపు అంతస్తును ప్రారంభించి, అనంతరం అక్కడ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఓల్డ్ సఫిల్‌గూడలో డీసీఎం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఆవిష్కరించడంతో పాటు, వినాయక్ నగర్ రైల్వే గేట్ సమీపంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు.
గౌతమ్ నగర్ డివిజన్లోని మల్లికార్జున్ నగర్లో రూ.40 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి భూమిపూజ నిర్వహించారు. అనంతరం ఐ.ఎన్. నగర్లో లబ్ధిదారులకు లేబర్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.
వేడుకల్లో అల్వాల్ మున్సిపల్ ఏఎంసీ హేమలత, మాజీ కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబితా, అనిల్ కిషోర్ గౌడ్, మేకల సునీత, రాము యాదవ్, జగదీష్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు బద్దం పరశురాం రెడ్డి, జీకే హనుమంతరావు, తోట నరేందర్ రెడ్డి, డోలి రమేష్, శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తలు, యువకులు, మహిళలు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
#Sidhumaroju
Alwal










