🎤భారత్ ఆవాజ్ కొమురం భీం ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని అర్హులైన ప్రతి రేషన్ కార్డుదారుడికి స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తామని తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ స్పష్టం చేశారు. శనివారం జిల్లా కలెక్టరేట్ వేదికగా ఈ నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరిత మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా మొత్తం 1,64,939 మంది లబ్ధిదారులకు ఈ స్మార్ట్ కార్డులను చేరవేయడమే లక్ష్యంగా యంత్రాంగం వేగంగా చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు.
ఈ నూతన రేషన్ కార్డులలో అత్యాధునిక క్యూఆర్ కోడ్ సదుపాయాన్ని ఏర్పాటు చేశామని, దీని ద్వారా లబ్ధిదారుల పూర్తి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా, అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకే ఈ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.










