ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రుణం పొందిన వరి, మొక్కజొన్న రైతులు పంటల బీమా నమోదును ఆగస్టు 31లోపు పూర్తి చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి వి.టి.రామారావు ఆదివారం తెలిపారు.
ఇప్పటివరకు జిల్లాలో 45,563 మంది రైతులు 26,854 హెక్టార్లకు బీమా నమోదు చేసుకున్నారని చెప్పారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా సంబంధిత బ్యాంకులను సంప్రదించి వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు.
#RAJESH










