గాంధీ రోజు ప్రారంభమైన ఐసిడిసి సేవలు ఈరోజుకి కొనసాగుతున్నాయి.

0
5

అనకాపల్లి జిల్లా రోలుగుంట  మాతృ మరణాలు, శిశు మరణాలను అరికట్టడం, బరువు తక్కువ పిల్లలు లేకుండా చేయడం అనే లక్ష్యంతో ఐసిడిఎస్ పథకాన్ని గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2న మన రాష్ట్రంలో ప్రారంభించారు.అప్పటి నుంచి ఇప్పటి వరకు అంగన్వాడి కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, సున్నా నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు సేవలు అందిస్తున్నారు. గర్భిణీలకు పోషకాహారం, ఆరోగ్య పరీక్షలు, బాలింతలకు పౌష్టికాహారం, చిన్నారులకు ప్రీస్కూల్ విద్య, పౌష్టికాహారం, టీకాలు, ఎదుగుదల పర్యవేక్షణ వంటి సేవలు అందిస్తున్నారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 2న అంగన్వాడి కేంద్రాల్లో గాంధీ జయంతితో పాటు అంగన్వాడి ఉత్సవాన్ని నిర్వహిస్తూ, ఐసిడిఎస్ సేవల ప్రాధాన్యతను ప్రజలకు వివరిస్తున్నారు.