🎤(భారత్ ఆవాజ్ న్యూస్) ఆసిఫాబాద్ (బురుగుడ): వట్టివాగు ప్రాజెక్టు కాలువలకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆసిఫాబాద్ జాతీయ రహదారిపై రైతులు భారీ రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళనకు ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి కోవ లక్ష్మి గారు స్వయంగా హాజరై, రైతులకు మద్దతుగా వారితో కలిసి జాతీయ రహదారిపైనే బైఠాయించి ధర్నాకు కూర్చున్నారు.
ప్రాజెక్టులో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ అధికారులు కాలువలకు విడుదల చేయడం లేదని, నీరు అందక తాము వేసిన వరి నాట్లు ప్రారంభ దశలోనే ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే, వందలాది మంది రైతులు హైవేని దిగ్బంధించడంతో వాహనాలు భారీగా నిలిచిపోయి తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి వట్టివాగు నీటిని విడుదల చేయాలని, అప్పటివరకు ఆందోళన విరమించేది లేదని ఎమ్మెల్యే, రైతులు స్పష్టం చేశారు.









