🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌లో భారీ సంక్షేమ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై పలు సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ప్రయోజనాలను అందజేశారు.
రెండో విడతలో ఎంపికైన అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను మంత్రి చేతుల మీదుగా అందించారు. పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. అనంతరం జిల్లాలో ఎంపికైన 270 మంది మహిళా లబ్ధిదారులకు ఇందిరమ్మ కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. మహిళలు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు, జిల్లా కలెక్టర్ కె. హరిత ఐఏఎస్ తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.










