ఆదివాసీలకు 100% ఉద్యోగ రిజర్వేషన్ల చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపాలని, 1/70 చట్టం పరిరక్షణకు సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో చింతూరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఒకరోజు నిరాహార దీక్ష నిర్వహించారు. ఎన్నికల హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని నాయకులు ఆరోపించారు. జీవో నెంబర్ 3 పునరుద్ధరణ, ఏజెన్సీ హక్కుల రక్షణ కోసం రాజకీయాలకు అతీతంగా ఆదివాసీలంతా ఏకతాటిపై వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ దీక్షకు ఆదివాసీ జేఏసీ, ఆదివాసి సంక్షేమ పరిషత్ నాయకులు పూర్తి మద్దతు ప్రకటించారు.
# Yadagiri










