‘జిల్లాలో శతశాతం అక్షరాస్యతే లక్ష్యం’|

0
0

జిల్లాలో శతశాతం అక్షరాస్యత సాధించేందుకు సమష్టిగా కృషి చేయాలని DRDA పీడీ శ్రీనివాస పాణి పిలుపునిచ్చారు. ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా ‘అక్షర ఆంధ్ర’ జిల్లా స్థాయి శిక్షణను విజయనగరం కలెక్టరేట్లో బుధవారం ప్రారంభించారు. 3వ విడత కార్యక్రమంలో సుమారు 1.26 లక్షల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. డిజిటల్ అక్షరాస్యతపై 100 గంటల శిక్షణలో అవగాహన కల్పిస్తామన్నారు.