ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్: గూడూరు జంక్షన్ కష్టాలకు చెల్లుచీటి.|

0
1

ఆంధ్రప్రదేశ్‌లో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ గూడూరు-గుమ్మిడిపూండి మధ్య 90 కి.మీ మేర 3, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.2,229 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా చెన్నై-కోల్‌కతా, ఢిల్లీ-చెన్నై మార్గాల్లో రైళ్ల రద్దీ గణనీయంగా తగ్గుతుంది. కృష్ణపట్నం పోర్టు, శ్రీసిటీ, శ్రీహరికోట వంటి కీలక పారిశ్రామిక, వ్యూహాత్మక ప్రాంతాలకు కనెక్టివిటీ మెరుగుపడుతుంది. స్వర్ణముఖి నదిపై మెగా బ్రిడ్జి సహా పలు వంతెనలను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు ప్రాంతీయ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తిరుపతి ఎంపీ గురుమూర్తి హర్షం వ్యక్తం చేస్తూ కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.