భూపాలపల్లి జిల్లా రేగొండ లో భారీ మొత్తంలో రేషన్ బియ్యం పట్టివేత|

0
1

భూపాలపల్లి జిల్లాలో పాత రైస్ మిల్ గోదాములో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 444.75 క్వింటాళ్ల పీడీఎస్ (PDS) రేషన్ బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ భాస్కర్ల రాజు రేగొండ మండల కేంద్రంలో తనిఖీలు నిర్వహించి ఈ భారీ బియ్యం బస్తాలను గుర్తించారు.

అధికారుల తనిఖీల అనంతరం ఈ బియ్యాన్ని అధికారికంగా స్వాధీనం చేసుకొని, సమీపంలోని మారుతి రైస్ మిల్‌లో భద్రపరిచారు. ఈ అక్రమ నిల్వకు సంబంధించి రైస్ మిల్ యజమాని శ్రీనివాస్ మరియు వాహన డ్రైవర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు నిమిత్తం పోలీసులకు అప్పగించారు. ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న ప్రధాన నిందితులు మరియు ఇతర సరఫరాదారుల కోసం అధికారులు విస్తృతంగా దర్యాప్తు జరుపుతున్నారు.