కుత్బుల్లాపూర్ అభివృద్ధికి నిరంతరం కృషి: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్|

0
1
మౌలిక వసతుల కల్పనలో భాగంగా గాజులరామారం డివిజన్‌లోని పలు కాలనీలలో సుమారు 4.32 కోట్ల రూపాయలతో చేపట్టనున్న బీటీ రోడ్డు, సీసీ రోడ్డు పనులకు బీఆర్‌ఎస్‌ ఎల్పీ విప్‌, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… గత 12 ఏళ్లలో నియోజకవర్గంలోని అన్ని కాలనీలు, బస్తీల అభివృద్ధి లక్ష్యంగా కోట్లాది రూపాయలు వెచ్చించామని, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. రానున్న రోజుల్లో కుత్బుల్లాపూర్‌లోని అన్ని ప్రాంతాలలో మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేస్తామన్నారు.
ప్రధాన పనుల వివరాలు:
  • ఉషోదయ కాలనీ ఫేస్ – 2: రూ. 1.66 కోట్లతో బీటీ రోడ్డు పనులు
  • బతుకమ్మ బండ: రూ. 80 లక్షలతో సీసీ రోడ్డు పనులు
  • యండమూరి లే ఔట్: రూ. 60 లక్షలతో సీసీ రోడ్డు పనులు
  • ప్రాగా టూల్స్: రూ. 40 లక్షలతో సీసీ రోడ్డు పనులు
  • కట్టమైసమ్మ బస్తీ: రూ. 34 లక్షలతో సీసీ రోడ్డు పనులు
  • శివపురం కాలనీ: రూ. 30 లక్షలతో సీసీ రోడ్డు పనులు
  • సాయి గ్రామం: రూ. 22 లక్షలతో సీసీ రోడ్డు పనులు
ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు, మాజీ కార్పొరేటర్ జగన్, పాక్స్ డైరెక్టర్ పరుశ శ్రీనివాస్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు విజయ్ రాంరెడ్డి, నాయకులు, కార్యకర్తలు మరియు ఆయా కాలనీల సంక్షేమ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.