చర్లపల్లి ఇండస్ట్రియలిస్ట్స్ అసోసియేషన్ (CIA) ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలు, దాతల సహకారంతో ఈ క్రీడా సముదాయాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ యువతకు క్రీడలతో పాటు నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ క్రీడలు యువతలో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. స్థానిక యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
అదేవిధంగా ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌తో పాటు ఈఎస్ఐ డిస్పెన్సరీని కూడా ప్రారంభించారు.
ప్రత్యేక ఆకర్షణ: పారిశ్రామిక అభివృద్ధితో పాటు యువతకు క్రీడా సదుపాయాలు అందుబాటులోకి రావడం చర్లపల్లి ప్రాంతానికి శుభపరిణామంగా నిలుస్తోంది.










