75 గజాల ఇళ్లపై సీఎంసీ కమిషనర్ సృజన సంచలన హెచ్చరిక|

0
0

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో 75 గజాల్లోపు ఇళ్లు 7 మీటర్లకు మించితే కూల్చివేస్తామని సీఎంసీ కమిషనర్ సృజన స్పష్టం చేశారు. సాధారణంగా 75 గజాలలోపు ఇళ్లకు అనుమతి అవసరం లేదని, అయితే నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న అక్రమ ఇళ్లకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని, తక్షణమే తొలగిస్తామని తెలిపారు. పార్కులో నిర్మించిన ఇంటిని ఖాళీ చేయడానికి మధ్యాహ్నం 2 గంటల వరకు గడువు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాలకు అనుమతినిచ్చే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని, మున్సిపల్ విభాగానికే పూర్తి అధికారాలు ఉన్నాయని కమిషనర్ తేల్చిచెప్పారు.