స్థానిక ఎన్నికల వేళ రామసముద్రంలో పోలీసుల పల్లె నిద్ర |

0
0

Ramasamudram: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీసులు పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టారు. మండలంలోని మినికి, మాలేనత్తం గ్రామ పంచాయతీలలో గురువారం ఎస్సై హృషికేశవ రెడ్డి ఆధ్వర్యంలో.

పోలీసులు గ్రామాల్లో పర్యటించి ప్రజలకు మహిళల భద్రత, బాల్య వివాహాల నివారణ, సైబర్ నేరాలపై అప్రమత్తత, దొంగతనాల నివారణ తదితర అంశాలపై విస్తృత అవగాహన కల్పించారు. అనంతరం రాత్రి వేళల్లో పోలీసులు గ్రామాల్లోనే బస చేసి ప్రజల భద్రతకు భరోసా కల్పించారు. గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్సై కోరారు.