ఏపీలో ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఫీజుల పెంపు. |

0
3

AP: అమరావతిలో ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో యూజీ, పీజీ కోర్సుల ఫీజులను శనివారం రాష్ట్ర ప్రభుత్వం మధ్యంతరంగా ఖరారు చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి యూజీ కోర్సులకు 10%, పీజీ కోర్సులకు 15% ఫీజులు పెరిగాయి.

MBBS, BDS ఫీజులు 10% పెరగ్గా, పీజీ మెడికల్, డెంటల్ కోర్సుల ఫీజులు 15% పెరిగాయి. NRI కోటాలో కూడా ఫీజులు గణనీయంగా పెరిగాయి. తుది ఫీజుల నిర్ణయం తర్వాత సర్దుబాటు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఈ పెంపుతో ప్రైవేట్ వైద్య విద్య మరింత ఖరీదైనదిగా మారనుంది.