మంచిర్యాలలో విద్యార్థులకు పోషకాహార అల్పాహారం

0
15

మంచిర్యాల : మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలేజీ రోడ్డులోని (పాత వ్యవసాయ మార్కెట్ యాడ్) లో హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెంట్రలైజ్డ్ కిచెన్ (కేంద్రీకృత వంటశాల) ను ప్రారంభించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్  కుమార్ దీపక్ , మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ,పద్మ నాయక ఫంక్షన్ హాల్ లో విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు,ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో అత్యాధునిక సాంకేతికత, పరిశుభ్రమైన వాతావరణంలో ఏర్పాటు చేసిన ఈ సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా వేలాది మంది విద్యార్థులకు ప్రతిరోజూ నాణ్యమైన, పౌష్టికాహారం అందించడం అభినందనీయమైన కార్యక్రమం.

ఏ బిడ్డా అర్ధాకలితో బడికి వెళ్లకూడదన్నదే ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వ సంకల్పం. విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు.

మానవ వనరులే రాష్ట్ర సంపద. సానబెట్టిన వజ్రాల్లా ప్రతి విద్యార్థిని తీర్చిదిద్ది ప్రపంచానికి దిశానిర్దేశం చేసే స్థాయికి తీసుకెళ్లాలన్నదే మా లక్ష్యం,ఇంత మంచి కార్యక్రమం మంచిర్యాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉపముఖ్యమంత్రి  భట్టి విక్రమార్కకి, మా మంచిర్యాల ప్రజల తరపున మరియు విద్యార్థులు తరుపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు,ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ చైర్మన్, సభ్యులు, సింగరేణి సంస్థ అధికారులు, DCP భాస్కర్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య- మహేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్పొరేటర్ తూముల నరేష్, కార్పొరేటర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.