మంచిర్యాల: పాఠశాల క్రీడా సమాఖ్య (SGF) మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో అండర్-14, అండర్-17 బాలబాలికల చెస్ ఎంపిక పోటీలు సెప్టెంబర్ 12న నిర్వహించనున్నట్లు జిల్లా అడిషనల్ కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి పి. చంద్రయ్య IAS, SGF సెక్రటరీ ఎం.డి. యాకూబ్ తెలిపారు.
మంచిర్యాల కాలేజ్ రోడ్‌లోని MIMS Play & High School వేదికగా ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయి. అండర్-14 విభాగానికి 01-01-2013 లేదా ఆ తర్వాత, అండర్-17 విభాగానికి 01-01-2010 లేదా ఆ తర్వాత జన్మించిన విద్యార్థులు అర్హులు.పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు తప్పనిసరిగా బోనఫైడ్, ఆధార్ కార్డుతో పాటు సొంత చెస్ బోర్డు సెట్ తీసుకురావాలని నిర్వాహకులు సూచించారు. సెప్టెంబర్ 9లోపు రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని, ప్రతి పాఠశాల నుంచి ఒక్కో కేటగిరీలో ఇద్దరు క్రీడాకారులకు మాత్రమే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఇ పోటీల నిర్వహణలో కన్వీనర్‌గా పాఠశాల కరెస్పాండెంట్ టి. శ్రీనివాస రాజు, ప్రిన్సిపాల్ జి. సంగీత, నిర్వాహక కార్యదర్శిగా మహేష్ వ్యవహరించనున్నారు.










