అమరావతి ఉద్యోగ జేఏసీ పిలుపు మేరకు కురుపాం తహశీల్దార్ కార్యాలయం వద్ద తహశీల్దార్ కె.జయతో పాటు రెవెన్యూ సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. ఈ మేరకు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై తమ నిరసనను తెలియజేశారు.










