వీరఘట్టం మండలం కంబరలో మన బాట మన మాట కార్యక్రమంలో కలెక్టర్ ప్రభాకర రెడ్డి డ్వాక్రా మహిళలతో మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా స్వశక్తి సాధించి తాము ఉత్పత్తి చేసే పంటలు.
వస్తువులను నేరుగా కార్పొరేట్ సంస్థలకు విక్రయించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. మార్కెటింగ్ నైపుణ్యాల పెంపునకు శిక్షణ, ప్రభుత్వ సహకారం అందిస్తామని తెలిపారు.గ్రామాల్లో డ్రైనేజీ కాలువల ఆక్రమణలను తొలగించాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు.










