ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు, ప్రారంభోత్సవ ప్రకటనల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనలు చోటుచేసుకోవడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వానికి సంబంధించిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ ప్రకటనల్లో సంబంధిత శాఖ మంత్రుల ఫొటోలు లేకపోవడం తీవ్రమైన పొరపాటని.
ఇది ఏమాత్రం సరికాదని స్పష్టం చేశారు. ముఖ్యంగా వెలిగొండ, పోలవరం ఎడమ కాలువ ప్రకటనల్లో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఫొటోను ముద్రించకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా కఠిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.










