చింతూరు మండలంలో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమాన్ని చింతూరు మండల కమిటీ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిమ్మలగూడెం నుంచి చింతూరు, చట్టి మీదుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఘన నివాళులు అర్పించారు. అనంతరం చింతూరు సెంటర్లోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నాయకులు.
కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ప్రజా సేవలను, పేదలు మరియు సామాన్య ప్రజల సంక్షేమం కోసం చేసిన కృషిని నాయకులు ఈ సందర్భంగా స్మరించుకున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని పలువురు నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం సందర్భంగా చింతూరు మండలంలో అభిమానులు, కార్యకర్తల సందడి నెలకొంది. చింతూరు మండల కమిటీ సభ్యులు మరియు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.
# Yadagiri










