● ఈ నెల 5, 6 తేదీల్లో ఇందిరాపార్క్ వద్ద ఆందోళన
● మహాధర్నాను విజయవంతం చేయడంపై ఈటల రాజేందర్ సమన్వయ సమావేశం
● పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్న బీజేపీ శ్రేణులు
ఆల్వాల్, సెప్టెంబర్ 3: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిషేధిత జాబితా 22ఏ అంశానికి వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 5, 6 తేదీల్లో ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నారు.
ప్రజల సమస్యలకు అండగా నిలుస్తూ, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా ఈ ఆందోళన చేపట్టాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది.
మహాధర్నాను విజయవంతం చేసేందుకు మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని బీజేపీ రాష్ట్ర, జిల్లా పదాధికారులు, డివిజన్ అధ్యక్షులు, వివిధ సెల్ల కన్వీనర్లు, కో-కన్వీనర్లు, మోర్చాల పదాధికారులతో ఎంపీ ఈటల రాజేందర్ శామీర్‌పేటలోని తన నివాసంలో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మహాధర్నాకు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చేలా కార్యాచరణపై చర్చించారు. ప్రజల సమస్యలపై నిర్వహిస్తున్న ఆందోళనను విజయవంతం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని బీజేపీ నాయకులు, కార్యకర్తలు హామీ ఇచ్చారు.
#sidhumaroju
Alwal










