1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బిగాల ఫైర్ |

0
3

1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బిగాల గణేష్ గుప్తా ఫైర్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినా ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీలు, 420 హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచనల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా నిజామాబాద్ NTR చౌరస్తాలో బిగాల గణేష్ గుప్తా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను ప్రస్తావిస్తూ రూపొందించిన 420 అడుగుల భారీ ఫ్లెక్సీని ప్రజల సమక్షంలో ప్రదర్శించారు. ఈ నిరసనలు వారం రోజుల పాటు కొనసాగుతాయని వెల్లడించారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైనందుకు సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని, అన్ని వాగ్దానాలను అమలు చేయాలని బిగాల డిమాండ్ చేశారు.

అదేవిధంగా 26వ డివిజన్ కోటగల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని బీఆర్ఎస్ పేర్కొన్న సంక్షేమ పథకాలు, పెండింగ్ నిధుల వివరాలతో రూపొందించిన ‘బాకీ కార్డులను’ ఇంటింటికీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్, సిర్ప రాజు, ప్రభాకర్ రెడ్డి, సత్య ప్రకాష్, నవీద్ ఇక్బాల్, జగత్ రెడ్డి, అబ్దుల్ మతీన్ తదితరులు పాల్గొన్నారు.