🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో, అత్యంత కోలాహలంగా జరిగాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక యాదవ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నాడు పట్టణంలో భారీ శోభాయాత్రను చేపట్టారు.పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో ప్రదర్శించిన సాంప్రదాయ విన్యాసాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ అద్భుత దృశ్యాలను వీక్షించేందుకు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
బాబాపూర్ జట్టు కైవసం: శోభాయాత్ర అనంతరం మధ్యాహ్నం నిర్వహించిన ఉట్టికొట్టే (ఉట్ల పండుగ) కార్యక్రమం ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. ఈ పోటీలో పలు జట్లు ఉత్సాహంగా పాల్గొనగా. ఎంతో పట్టుదలతో మరియు సమన్వయంతో ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామ జట్టు ఉట్టిని కొట్టి ఘన విజయం సాధించింది. విజేతగా నిలిచిన బాబాపూర్ జట్టును నిర్వాహకులు మరియు స్థానికులు ప్రత్యేకంగా అభినందించి అభినందనలు తెలియజేశారు.










