ఉపాధ్యాయులు విద్యార్థులకు పునాది లాంటి వాళ్లు

0
0

నందవరం మండల కేంద్రంలోMPPS స్పెషల్ పాఠశాల హెచ్ఎం ఎండి శ్రీనివాసులు గారు నిర్వహించిన గురుపూజోత్సవ వేడుకల్లో నందవరం గ్రామ పెద్దలు, పాఠశాల యాజమాన్య కమిటీ మండల విద్యాశాఖాధికారి, ప్రధానోపాధ్యాయులను, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు … ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MEO దాసరి గోవింద్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 14 మంది ఉపాధ్యాయులను శాలువా, పూలదండలతో ఘనంగా సన్మానించి, సమాజ నిర్మాణంలో వారు పోషిస్తున్న కీలక పాత్రను కొనియాడాను.

విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల సేవలు ఎంతో కీలకం. విద్యను అందించడంతో పాటు విలువలు, క్రమశిక్షణ, నైతికత, సామాజిక బాధ్యతలను నేర్పుతూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయుల సేవలు అభినందనీయం. ఈ కార్యక్రమంలో దేవుళ్ళ భీమ శేఖర్ సప్లయర్ వీరేష్, గవ్వల నారాయణ, రాజోలి గజేంద్రనాయుడు, పాఠశాల టీచర్లు దేవపాల్, నరసన్న, మహబూబ్ బాషా, నాగరాజు, ప్రశాంత్, సుబ్బయ్య ,గౌతమి, విజయశాంతి ,విద్యాలక్ష్మి, పద్మావతి, ప్రమీల రాణి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.