తప్పిపోయిన చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన పోలీస్ కమిషనర్

0
1

 

నిజామాబాద్ ప్రభుత్వ ఆసపత్రి నుంచి 2½ సంవత్సరాల చిన్నారి కోసడి వేదాన్ష్ అపహరణ ఘటనపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.

#NizamabadCP పి. సాయి చైతన్య, IPS గారు చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఘటన వివరాలను తెలుసుకున్నారు.

సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తూ చిన్నారి ఆచూకీని త్వరితగతిన గుర్తించాలని అధికారులను ఆదేశించారు.

చిన్నారి ఆచూకీ కోసం పోలీస్ శాఖ అన్ని విధాలుగా కృషి చేస్తోంది.