రాష్ట్ర ఉత్తమ ప్రధానోపాధ్యాయుడికి ఘన సన్మానం|

0
2

చీరాల N.R.& P.M. హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు బి. సాల్మన్ రాజును వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ చేతుల మీదుగా ఆయన రాష్ట్ర ఉత్తమ ప్రధానోపాధ్యాయుల అవార్డు అందుకున్న సందర్భంగా ఈ వేడుక నిర్వహించారు. 1990 నుంచి గణిత ఉపాధ్యాయుడిగా, NCC అధికారిగా 35 సంవత్సరాల పాటు ఆయన అందించిన సేవలను వక్తలు కొనియాడారు. ఇదే పాఠశాలలో సుదీర్ఘకాలం పనిచేసి విద్యారంగంలో విశిష్ట సేవలు అందించిన ఆయనకు రాష్ట్రస్థాయి గుర్తింపు రావడం పట్ల అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. సన్మాన గ్రహీతను శాలువాతో సత్కరించి అల్పాహారం అందించారు.