ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజాసేవను పురస్కరించుకుని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో సేవా సంకల్ప్ అభియాన్ జిల్లా స్థాయి వర్క్‌షాప్ ఘనంగా జరిగింది. జిల్లా అధ్యక్షులు ధోని శ్రీశైలం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు చేపట్టబోయే కార్యక్రమాలను ఖరారు చేశారు. ఈ నెల రోజుల్లో లబ్ధిదారుల ఇళ్లలో ఆశీస్సుల దీపం వెలిగించడం, విద్యార్థులకు పోటీలు, వీధి నాటకాలు, రక్తదానం, స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే సేవా సేతు శిబిరాల ద్వారా కేంద్ర పథకాల రిజిస్ట్రేషన్లు చేయనున్నట్లు తెలిపారు.










