అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు: దేశద్రోహం కేసు నమోదుకు ఫిర్యాదు|

0
137

ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి: డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్‌పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకొని, దేశద్రోహం కేసు నమోదు చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి పోలీస్ స్టేషన్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్ మహేందర్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాజ్యాంగ ఫలాలను అన్ని వర్గాలకు అందించిన మహానీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. అలాంటి వ్యక్తిపై మనువాద భావజాలంతో వ్యాఖ్యలు చేయడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని మండిపడ్డారు.ఈ నెల 18న అంబేడ్కర్‌పై రాసిన వివాదాస్పద పుస్తకాన్ని విడుదల చేయడానికి హమారా ప్రసాద్ ప్రయత్నిస్తున్నారని, దీనివల్ల శాంతిభద్రతల సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నందున ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ పుస్తక ప్రచురణ, విడుదలను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుర్నులే నారాయణ, డాక్టర్ అశోక్ మహుల్కర్, దుర్గం శ్యామ్ రావు తదితర నాయకులు పాల్గొన్నారు.