గణేష్‌ మండపాల నిర్వాహకులతో పోలీసుల భేటీ.|

0
3

అల్వాల్, సెప్టెంబర్ 10: గణేష్‌ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై సూరారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గణేష్‌ మండపాల నిర్వాహకులతో పోలీసులు సమావేశం నిర్వహించారు.

కుత్బుల్లాపూర్‌ ఏసీపీ బాలగంగిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.

గణేష్‌ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా భద్రత, ట్రాఫిక్‌ నియంత్రణ, శాంతిభద్రతలకు సంబంధించిన జాగ్రత్తలను ఏసీపీ వివరించారు.

పోలీసుల మార్గదర్శకాలను మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పాటించాలని, ఉత్సవాలు ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు పోలీసులకు సహకరించాలని సూచించారు.

సమావేశంలో సూరారం సీఐ కే. బాలరాజు, జీడిమెట్ల ట్రాఫిక్‌ ఎస్‌హెచ్‌ఓ నరసింహారావు, సూరారం ఎస్‌ఐలు రాజు, కృష్ణ, కిషన్‌ పాల్గొన్నారు.

#sidhumaroju

Alwal