బీసీల హక్కుల కోసం ధర్మపోరాటం ఆసిఫాబాద్‌లో నేడు మహా దీక్ష|

0
82

ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ ప్రతినిధి): బీసీ సామాజిక వర్గాలకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు రూప్నర్ రమేష్ స్పష్టం చేశారు. గురువారం జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

దేశవ్యాప్తంగా చేపట్టే జనగణనలో బీసీల కోసం ప్రత్యేక కాలమ్‌ను కేటాయించాలని, ప్రతి కులానికి ఒక యూనిక్ కోడ్‌ను కేటాయించి శాస్త్రీయంగా కులగణన చేపట్టాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరిని, నిర్ణయాలను నిరసిస్తూ శుక్రవారం ఆసిఫాబాద్‌లోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద భారీ “ధర్మ పోరాట దీక్ష”ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

బీసీల రాజకీయ, విద్యా, ఉద్యోగ హక్కుల సాధనకై చేపట్టే ఈ ధర్మపోరాట దీక్షకు జిల్లాలోని బీసీ ప్రజాసంఘాలు, యువకులు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని రూప్నర్ రమేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం ముఖ్య నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.