సత్యసాయిజిల్లా : రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో శుక్రవారం జరిగిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు రెండో రోజు సమావేశంలో శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఎ. శ్యాంప్రసాద్, ఐఏఎస్, జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ.
మహిళల భద్రత, డ్రగ్స్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ తదితర అంశాలపై ముఖ్యమంత్రి అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు. జిల్లాల వారీగా ప్రజా భద్రత, పాలనకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించారు.










