🎤ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో నెలవారీ నేర పరిశీలన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే లక్ష్యంగా పెండింగ్ కేసులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. రానున్న గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు.
జిల్లాలో గంజాయి సాగు, రవాణా, నిల్వలతో పాటు మట్కా, జూదం, బెట్టింగ్ లాంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేశారు. మహిళలు, చిన్నారుల భద్రతతో పాటు సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. సిసిటిఎన్ఎస్ (CCTNS) సాంకేతికతను విరివిగా వాడాలని, సిసి కెమెరాల ఏర్పాటును ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లను గుర్తించి, డ్రంక్ అండ్ డ్రైవ్, రాష్ డ్రైవింగ్‌పై నిరంతర తనిఖీలు చేపట్టాలన్నారు. బ్లూ కోల్ట్స్ పెట్రోలింగ్ పెంచాలని, డయల్-112 అత్యవసర కాల్స్‌కు పోలీసులు తక్షణమే స్పందించాలని ఎస్పీ నితికా పంత్ కఠిన ఆదేశాలు జారీ చేశారు.










