సత్యసాయి జిల్లా : మహిళలు, చిన్నారుల భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు శక్తి టీమ్ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు పలు ప్రాంతాల్లో అవగాహన ర్యాలీలు చేపట్టారు. పోలీసు సిబ్బంది, శక్తి టీమ్ సభ్యులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.POCSO చట్టం, బాల్య వివాహాల నివారణ, మహిళలు, చిన్నారులపై వేధింపుల నిరోధం, సైబర్ భద్రత తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
అత్యవసర పరిస్థితుల్లో 100, 112, 1091, 1098, 181 హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించుకోవాలని సూచించారు. మహిళలు, చిన్నారుల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని శక్తి టీమ్ సభ్యులు తెలిపారు.










