కత్తుల దాడి.. వ్యక్తి హతం.|

0
7

● తుకారాంగేట్‌ పరిధిలో ఘటన

● పాతకక్షలే కారణమా?

అల్వాల్, సెప్టెంబర్ 14: మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని తుకారాంగేట్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది.

బుద్ధనగర్‌లో గణేష్ మండపం వద్ద కార్తీక్‌ (40)పై కొందరు కత్తులతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

నాలుగేళ్ల క్రితం ఓ యువతి ప్రేమ వివాహానికి కార్తీక్‌ సహకరించినట్లు తెలుస్తోంది.

అప్పటి నుంచి యువతి కుటుంబ సభ్యులతో అతడికి విభేదాలు ఉన్నట్లు సమాచారం. గణేష్ మండపం ఏర్పాటుకు సంబంధించి ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలిసింది.

పరిస్థితిని గమనించిన పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను మందలించారు.

అనంతరం మరోసారి ఘర్షణ చోటుచేసుకోవడంతో కార్తీక్‌పై కత్తులతో దాడి జరిగినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన అతడిని పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఘటనపై తుకారాంగేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల వివరాలు, అరెస్టులపై పోలీసుల అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

#Sidhumaroju

Alwal