● ఆరు నెలల గర్భిణి దారుణ హత్య
● భర్తే గొంతు నులిమినట్లు అనుమానం
● ఘటనపై అల్వాల్ పోలీసుల దర్యాప్తు
అల్వాల్, సెప్టెంబర్ 14: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్యనగర్‌లో ఆదివారం రాత్రి ఆరు నెలల గర్భిణి శివాని హత్యకు గురైంది.
ఆమె భర్త పరశురామ్ గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
భార్యపై అనుమానంతో దంపతుల మధ్య తరచూ వివాదాలు జరుగుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.
ఘటనపై సమాచారం అందుకున్న అల్వాల్ పోలీసులు సూర్యనగర్‌లోని ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
క్లూస్‌టీమ్ ఆధారాలను సేకరించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
హత్యకు దారితీసిన పూర్తి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
#Sidhumaroju
Alwal










