• ఐదో అంతస్తులో గది తాళం పగులగొట్టి ఖరీదైన సామగ్రి అపహరణ
• బోరబండ పోలీసులకు ఆసుపత్రి నిర్వాహకుల ఫిర్యాదు
• కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
అల్వాల్, సెప్టెంబర్ 20: హైదరాబాద్ సనత్‌నగర్‌లోని టిమ్స్ ఆసుపత్రిలో చోరీ ఘటన కలకలం రేపింది.
ఆసుపత్రి ఐదో అంతస్తులోని సామగ్రి నిల్వ గది తాళాన్ని గుర్తుతెలియని దుండగులు పగులగొట్టి లోపల ఉన్న విలువైన సామగ్రిని అపహరించారు.
చోరీ విషయాన్ని గుర్తించిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే నిర్వాహకులకు సమాచారం అందించారు. దీంతో ఆసుపత్రి నిర్వాహకులు బోరబండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చోరీకి గురైన సామగ్రి వివరాలు, వాటి విలువపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఘటనకు సంబంధించి ఇతర వివరాలు దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.
#Sidhumaroju
Alwal










