గంజాయి గుప్పిట్లో.. ముగ్గురి కథ.|

0
10

● మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్‌లో రెండు వేర్వేరు కేసులు

● 7.163, 21 కిలోల గంజాయి స్వాధీనం

● ఇద్దరు మహిళలు సహా ముగ్గురి అరెస్ట్

అల్వాల్, సెప్టెంబర్ 21: మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు ఆదివారం నిర్వహించిన రెండు వేర్వేరు తనిఖీల్లో మొత్తం 28.163 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 

ఈ రెండు కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేశారు.

మల్కాజ్‌గిరిలోని ఆర్‌కే నగర్ ఆటోస్టాండ్ సమీపంలో 7.163 కిలోల గంజాయి పట్టుబడింది. ఈ కేసులో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నార్త్ దినాజ్‌పూర్‌కు చెందిన బప్పాను అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

సికింద్రాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయం సమీపంలో మరో 21 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో తమిళనాడు రాష్ట్రం మదురైకి చెందిన ఇందు రాణి, రాజమ్మల్ పన్జగమ్‌ను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

రెండు కేసుల్లో పట్టుబడిన గంజాయిని విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి నగరానికి తరలించినట్లు దర్యాప్తులో గుర్తించారు. 

నిందితులపై కేసులు నమోదు చేసిన ఎక్సైజ్ అధికారులు కేసు వివరాలను తదుపరి చర్యల కోసం మల్కాజ్‌గిరి ఎస్హెచ్ఓకు అందజేశారు.

గంజాయి స్వాధీనం చేసుకున్న అనంతరం, సోమవారం ముగ్గురు నిందితులను కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు వారిని రిమాండ్‌కు తరలించారు. 

గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది.

#Sidhumaroju

Alwal