అదిలాబాద్ రిమ్స్ లో తీవ్ర విషాదం

0
3

బ్రేకింగ్ న్యూస్

 

ఆదిలాబాద్ రిమ్స్‌లో తీవ్ర విషాదం

 

చిన్నారుల వార్డులో ఏసీ పేలడంతో 5 రోజుల శిశువు మృతి

 

ఆందోళనకరంగా మరో 24 మంది చిన్నారుల పరిస్థితి 

 

అందులో ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమం

 

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి ఎస్ఎన్‌సీయూ వార్డులో సోమవారం అర్ధరాత్రి షార్ట్‌సర్క్యూట్ ఘటన కలకలం రేపింది. చిన్నారుల వార్డులో ఏసీ పేలడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. భయాందోళనకు గురైన తల్లిదండ్రులు పిల్లలను తీసుకుని బయటకు పరుగులు తీశారు.

 

ఈ ఘటనలో 5 రోజుల శిశువు మృతి చెందగా మరో 24 మంది చిన్నారులను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించగా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

 

విద్యుత్ సరఫరాను నిలిపివేసిన సిబ్బంది చిన్నారులను పక్క వార్డుకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కలెక్టర్ రాజర్షి షా, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న రిమ్స్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.