కుప్పంలో దాదర్-పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ హాల్ట్.. ప్రారంభించిన సీఎం చంద్రబాబు.

0
0

 

కుప్పం రైల్వే స్టేషన్‌లో దాదర్-పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్‌కు అదనపు హాల్ట్

చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభోత్సవం

సీఎం విజ్ఞప్తితో రైల్వే బోర్డు అనుమతి

రెండు నిమిషాల పాటు ఆగనున్న ఎక్స్‌ప్రెస్ రైలు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పం ప్రజలకు మెరుగైన రైలు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. తన రెండు రోజుల నియోజకవర్గ పర్యటనలో భాగంగా సోమవారం రాత్రి కుప్పం రైల్వే స్టేషన్‌లో దాదర్-పుదుచ్చేరి ట్రై-వీక్లీ ఎక్స్‌ప్రెస్ (11005/11006) రైలు అదనపు హాల్ట్‌ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

 

ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తి మేరకు రైల్వే బోర్డు ఈ హాల్ట్‌ను ప్రయోగాత్మక ప్రాతిపదికన మంజూరు చేసింది. ప్రారంభోత్సవం అనంతరం సోమవారం రాత్రి కుప్పం స్టేషన్‌లో ఆగిన దాదర్ నుంచి పుదుచ్చేరి వెళ్తున్న రైలు (నెం. 11005) ప్రయాణికులతో ముఖ్యమంత్రి ముచ్చటించి, ప్రజల నుండి వినతులు స్వీకరించారు. మంగళవారం నుండి పుదుచ్చేరి-దాదర్ ఎక్స్‌ప్రెస్ (నెం. 11006) కూడా ఇక్కడ నిలవనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.