పోలీసుల వైఖరిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సివిల్ వివాదాల్లో ‘ప్రీ లిటిగేషన్ కౌన్సిలింగ్ ఫోరం’ (పీఎల్సీఎఫ్) పేరుతో విశాఖ పోలీసులు జోక్యం చేసుకోవడాన్ని ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించింది. అసలు సివిల్ తగాదాల్లో జోక్యం చేసుకునే అధికారం పోలీసులకు ఎక్కడిదని ఈ సందర్భంగా ఘాటుగా ప్రశ్నించింది.
పోలీస్ యూనిఫాం ధరించి కౌన్సిలింగ్ నిర్వహించడం అంటే బాధితులను బెదిరించడమేనని హైకోర్టు అభిప్రాయపడింది. ఇటువంటి చర్యలను అనుమతిస్తే భవిష్యత్తులో సమాంతర న్యాయస్థానాలు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. సివిల్ వివాదాలను పరిష్కరించాల్సిన బాధ్యత కోర్టులదేనని, పోలీసులది కాదని స్పష్టం చేసింది.










