కులమతాలకు అతీతంగా వినాయకుడి ముందు ముస్లిం సోదరుడి పూజ.

0
1

నీరుగట్టువారిపల్లి చౌడేశ్వరి నాలుగో వీధిలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ముస్లిం సోదరుడు బాబావలి వినాయకుడికి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ యూనిట్ ఇన్‌చార్జ్ కందికట్ల జయ మాట్లాడుతూ. కులమతాలకు అతీతంగా బాబావలి పూజలో పాల్గొనడం మతసామరస్యానికి నిదర్శనమన్నారు. ప్రజలంతా సోదరభావంతో పండుగలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మోడం మహేష్, అరగొండ శేఖర, గుండ్లపల్లి ఆనంద్, ఉప్పు అనిల్ పాల్గొన్నారు.