మంచిర్యాల: గణేష్ నిమజ్జన ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సూచించారు.
మంచిర్యాల ఎం కన్వెన్షన్ హాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నిమజ్జన ఏర్పాట్లు, శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ, భక్తులకు అవసరమైన సౌకర్యాలపై అధికారులు, ఉత్సవ కమిటీ నిర్వాహకులతో చర్చించారు.
ప్రతి ఒక్కరి సహకారంతో గణేష్ నిమజ్జనాన్ని విజయవంతంగా నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.










